తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా కార్యకర్తల ధర్నా - DHARNA

వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందంటూ.. భాజపా కార్యకర్తలు, స్థానిక ప్రజలు బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా కార్యకర్తల ధర్నా

By

Published : Jul 8, 2019, 5:45 PM IST

Updated : Jul 10, 2019, 7:55 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని పట్టణంలోని ఉద్మీర్ గల్లీ, శక్కర్ నగర్ కాలనీ వాసులు, కాషాయ దళ కార్యకర్తలు ఆందోళన చేశారు. మున్సిపల్ కమిషనర్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విభజన చేశారని ఆరోపించారు. గడువు ముగిసినప్పటికీ... వార్డుల విభజన పత్రాలను సూచిక బోర్డులో ఏర్పాటు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ గోపీరామ్​కు వినతి పత్రం అందజేశారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా కార్యకర్తల ధర్నా
Last Updated : Jul 10, 2019, 7:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details