నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో భాజపా తరఫు నుంచి పోటీ చేసి రాజేశ్వర్ ఎంపీటీసీగా గెలుపొందారు. నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నికలలో అతను తెరాసకు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. కాషాయ పార్టీ నుంచి గెలిచి తెరాసకు ఎలా మద్దతిస్తావంటూ రాజేశ్వర్‌ను నిలదీశారు. భాజపాకి వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పినందువల్లే తాను గులాబీదళానికి మద్దతిచ్చానని, ఇతర ఏ ప్రలోభాలకు లొంగలేదని రాజేశ్వర్ స్పష్టం చేశారు.
'భాజపా నుంచి గెలిచి తెరాసకు ఎలా మద్దతిస్తావు...?' - GODAVA
భాజపా నుంచి పోటీ చేసి ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్థి తెరాసకు మద్దతివ్వడాన్ని నిరసిస్తూ కాషాయదళ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
'భాజపా నుంచి గెలిచి తెరాసకు ఎలా మద్దతిస్తావు...?'