వెంటనే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో తెరాస ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆటోరియం నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ ధర్నాకి నగరంలో ఇళ్లు లేని పేదలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
'ధనిక రాష్ట్రంలో కూడా పేద ప్రజలకు ఇళ్లులేవు' - పేద ప్రజలకు త్వరగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ... నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భాజపా కార్యకర్తల ధర్నా
పేద ప్రజలకు త్వరగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ... నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భాజపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
!['ధనిక రాష్ట్రంలో కూడా పేద ప్రజలకు ఇళ్లులేవు' bjp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5254561-1039-5254561-1575368320636.jpg)
'ధనిక రాష్ట్రంలో కూడా పేద ప్రజలకు ఇళ్లులేవు'
పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో కేసీఆర్ విఫలమయ్యారని భాజపా కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్లకు మోక్షం కలగడం లేదని, ఏ పథకం కూడా పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ విలాసవంతమై జీవితం గడుపుతున్నారని, ప్రతి పేదబిడ్డకు ఇల్లు అందేవరకు భాజపా పోరాటం చేస్తుందన్నారు.
'ధనిక రాష్ట్రంలో కూడా పేద ప్రజలకు ఇళ్లులేవు'
ఇవీ చూడండి: పశువైద్యురాలి ఘటన మరవకముందే...