నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సీహెచ్‌సీలో ఓ మహిళ 5 కిలోల బరువున్న పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. బుధవారం పది మంది గర్భిణులకు శస్త్రచికిత్సలు చేశారు. డిచ్‌పల్లి మండలం కమలాపూర్‌కు చెందిన శ్రావణి ఐదు కిలోల బరువున్న పాప జన్మించింది. చాలా అరుదుగా... పిల్లలు అధిక బరువుతో పుడతారని వైద్యులు తెలిపారు.
5KGs BABY BORN: నిజామాబాద్‌లో బేబీ బాహుబలి.. 5కిలోల బరువుతో జననం - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా 2.3 కేజీల నుంచి 3.7 కేజీల వరకు బరువుంటారు. కానీ, నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ బేబీ బాహుబలికి జన్మనిచ్చింది. ఈ బాలిక ఏకంగా 5 కేజీల బరువుండడం గమనార్హం. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని మాతా శిశు విభాగం జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ అంజన తెలిపారు.
5 కిలోల బరువుతో శిశువు జననం
సాధారణంగా శిశువులు 2 కేజీల నుంచి 3.7 కిలోల బరువుతో పుడతారు. జన్యుపరమైన కారణాలు, నెలలు నిండాక ఎక్కువ రోజులు గడవటం... పిల్లలు అధిక బరువుతో పుట్టడానికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని మాతా శిశు విభాగం జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ అంజన తెలిపారు.
ఇదీ చదవండి:KTR: మొదలైన ఏడో విడత హరితహారం... మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్