నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణకు ద్విచక్ర వాహనాల ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించారు. చౌరస్తా నుంచి పలు కాలనీల్లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ చేపట్టారు.
నిధి సేకరణకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ - తెలంగాణ వార్తలు
రుద్రూర్ మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ నిధి సేకరణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 1000 మందికి పైగా భక్తులు పాల్గొని జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు.
![నిధి సేకరణకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ bikes rally at Rudrur Mandal Center to donations for construction of Rama Mandir in Ayodhya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10297969-705-10297969-1611051444444.jpg)
నిధి సేకరణకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ
కన్నులపండువగా సాగిన ర్యాలీలో సుమారు 1000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. జై శ్రీ రామ్ అంటూ భక్తులు చేసిన నినాదాలతో వీధుల్లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గుండె సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తలసాని
TAGGED:
bikes rally at Rudrur Mandal