అడవులను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజనల్ అటవీ అధికారి సాగర్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ద్విచక్ర వాహనాలతో అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
'అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' - బాన్సువాడలో అటవీ అధికారుల బైక్ ర్యాలీ
అడవులను కాపాడుకోవడం ద్వారా మన భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారిమవుతామని నిజామాబాద్ బాన్సువాడ డివిజనల్ అటవీ అధికారి సాగర్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిబ్బందితో కలిసి పట్టణంలో బైక్ ర్యాలీని నిర్వహించారు.
!['అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' Bike rally of forest officials on the occasion of World Forest Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11098448-316-11098448-1616322610257.jpg)
'అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
ప్రతి ఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డివిజనల్ అటవీ అధికారి సాగర్ తెలిపారు. అడవులను కాపాడుకోవడం ద్వారా మన భవిష్యత్తు తరాలకు ఎంతగానో మేలు చేసిన వారిమవుతామని అన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో చెట్లు నాటాలని.. అడవుల పెంపకం కోసం అటవీశాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి గంగాధర్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తెరాస గెలిచింది: కోదండరామ్