తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ స్తంభాన్ని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... ఒకరు మృతి - నిజామాబాద్​లో రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

Bike Accident at Nizamabad, one Person died
విద్యుత్​ స్తంభాన్ని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం

By

Published : Jul 11, 2020, 8:46 PM IST

నిజామాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం తిరుమలపల్లి గ్రామానికి చెందిన కృష్ణ, అజయ్ అనే ఇద్దరు యువకులు నగరంలో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యుత్​ స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో కృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అజయ్​కు తీవ్రగాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అజయ్​ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details