వంద పడకల సామర్థ్యంతో ఉన్న బోధన్ ఆస్పత్రిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిగా మార్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లావాసులతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి కూడా వైద్యసేవల కోసం వస్తుంటారు. సౌకర్యాలు బాగుండడం వల్ల ప్రసవాల కోసం ఎక్కువ సంఖ్యలో గర్భిణిలు వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆస్పత్రికి కరోనా భయం పట్టుకొంది. సిబ్బంది ఒక్కొక్కరుగా వైరస్ బారిన పడుతుండటం వల్ల ఉన్న సిబ్బందిపై పనిభారం రెట్టింపవుతోంది. కొన్ని విభాగాలను మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తాత్కాలిక సిబ్బందిని నియమించి సేవలు అందించడానికి కూడా.. ఎవరూ ముందుకు రావడం లేదు. కొవిడ్ పరీక్షలకు ఛాతి ఎక్స్రే కీలకం. ఇక్కడి ఎక్స్రే విభాగంలో ఒక రేడియో గ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్ ఉన్నారు. వీరిద్దరూ కరోనా వైరస్ బారిన పడటం వల్ల వారం రోజుల నుంచి ఈ విభాగాన్ని మూసివేశారు. బాధితుల లక్షణాలు మౌఖికంగా రాసుకుని పరీక్షలు చేస్తున్నారు. అత్యవసర కేసుల కోసం ఆపరేషన్ థియేటర్ ఉపయోగిస్తున్నారు.
బోధన్ ఆస్పత్రిలో.. 10 మందికి కరోనా పాజిటివ్! - బోధన్ జిల్లా ఆస్పత్రి
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిని కరోనా పాజిటివ్ కేసులు వెంటాడుతున్నాయి. ఇక్కడ పనిచేసే 60మంది సిబ్బందిలో పది మందికి వైరస్ సోకింది. కీలకమైన విభాగాల్లో పనిచేసే వారే కొవిడ్ బారిన పడటం వల్ల వైద్యసేవలు నిలిపివేశారు. బోధన్ పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు, మహారాష్ట్ర వాసులు కూడా ప్రసవాల కోసం వస్తుంటారు. ఇక్కడ నెలకు మూడు వందల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి.
గతనెలలో ఇద్దరు నర్సులు, ఓ వైద్యుడికి కొవిడ్ సోకడం వల్ల కొన్నిరోజులు మూసివేశారు. ఇటీవలే సేవలు తిరిగి ప్రారంభించగా ఇద్దరు స్త్రీ వైద్య నిపుణుల కుటుంబ సభ్యులకు వైరస్ సోకి.. వాళ్లు హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మూడురోజుల పాటు శస్త్రచికిత్సలకు అంతరాయం నెలకొంది. ఆస్పత్రిలో 26 నర్సు పోస్టుల్లో 13 ఖాళీలు ఉన్నాయి. హెడ్నర్సులతో కలిపి 18 మంది, ఇతర ఒప్పంద సిబ్బంది ఐదుగురు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు నలుగురు కరోనా బారిన పడ్డారు. ఉన్న సిబ్బందిని ఆయా విభాగాలకు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. ముగ్గురు వైద్యులకు కరోనా సోకింది. ఒకరు కోలుకుని విధులకు హాజరవుతుండగా... మరో వైద్యుడి క్వారంటైన్ పూర్తైన వ్యాధి నుంచి కోలుకోకపోవడం వల్ల సెలవు కొనసాగించే అవకాశం ఉంది. ఇంకో వైద్యుడికి ఇటీవలే పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇద్దరు వైద్యుల కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డా.. సెలవు దొరకని పరిస్థితి. ఒక వైద్యుడిని పూర్తిగా కొవిడ్ విభాగానికి కేటాయించగా.. సిబ్బంది సైతం సోకుతుందని భయపడుతున్నారు. ఎక్స్రే మూసేయాల్సిన పరిస్థితు. ఉన్నతాధికారులకు చెబితే తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని సూచిస్తున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో సేవలందించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటూ సేవలందిస్తున్నామని, సిబ్బంది సరిపోక చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నారు.
ఇదీ చూడండి :ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం