తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​లో మళ్లీ కరోనా పరేషాన్.. స్టేషన్​లో పోలీసుల జాగ్రత్తలు! - కరోనా జాగ్రత్తలు

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో పోలీసులు స్టేషన్​ ఆవరణలోనికి ఇతరులను ఎవరినీ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాళ్లు, బారికేడ్లు పెట్టి నిలువరిస్తున్నారు. చేతులు శానిటైజ్​ చేసుకున్న తర్వాతే కేసులు రాసుకుంటున్నారు.

Bhodan Police Takes Special Actions For Corona In Police station
బోధన్​ పోలీసుల కరోనా జాగ్రత్తలు!

By

Published : Jun 26, 2020, 12:01 PM IST

కరోనా ప్రాణాలు కబళిస్తున్నా.. గుండె ధైర్యం కోల్పోకుండా ప్రజలకు సేవ చేసిన వారిలో పోలీసులు ఒకరు. డాక్టర్లు వైద్యం అందించి ప్రాణాలు కాపాడితే.. పోలీసులు వైరస్​ వ్యాపించకుండా లాక్​డౌన్​ సమయంలో ప్రజలను కట్టడి చేసి విధులు నిర్వహించారు. ఇప్పుడు లాక్​డౌన్​ సడలించడం వల్ల స్టేషన్​లోనే విధులు నిర్వర్తిస్తూ.. కరోనా దరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీస్​ స్టేషన్ల దగ్గర ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టడి చేస్తున్నారు. విధుల్లో ఉండే పోలీసులను తప్ప.. బయటి వ్యక్తులను స్టేషన్​లోకి అనుమతించడం లేదు. బోధన్​ గ్రామీణ పోలీస్ స్టేషన్ బయట శానిటైజర్ ఏర్పాటు చేసి చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్​లో సైతం కిటికీల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం

ABOUT THE AUTHOR

...view details