భగత్‌సింగ్ ఆశయాలు, ఆయన కలలుగన్న లక్ష్యాల కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్ తెలిపారు. భగత్‌సింగ్ తన ప్రాణాలను లెక్కచేయకుండా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఆయన 113వ జయంతిని పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ చౌరస్తాలోని షహిద్ భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'భగత్‌సింగ్ ఆశయాల కోసం నిరంతరం పోరాడుతాం' - భగత్‌సింగ్
సంపూర్ణ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారని నిజామాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు అనిల్ అన్నారు. భగత్‌సింగ్ కలలుగన్న లక్ష్యాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. కుల, మత రహిత సమాజం స్థాపించాలనే లక్ష్యంతో సాధించుకున్న దేశంలో మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన 113వ జయంతిని పురస్కరించుకొని భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
!['భగత్‌సింగ్ ఆశయాల కోసం నిరంతరం పోరాడుతాం' bhagat singh birth anniversary by sfi in nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8967635-286-8967635-1601283016610.jpg)
'భగత్‌సింగ్ ఆశయాల కోసం నిరంతరం పోరాడుతాం'
కుల, మత రహిత సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో బ్రిటిష్ వారితో పోరాడి సాధించుకున్న ఈ దేశంలో ప్రస్తుతం మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు మారుతి, సతీష్‌లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:భగత్ సింగ్‌కు మోదీ, షా నివాళులు