పిల్లల్లో ఉండే సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి, టీకాల వల్ల కరోనా మహమ్మారి తీవ్రత అంతగా లేదని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరికృష్ణ చెబుతున్నారు. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో పిల్లల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగినా... తీవ్రమైన ఇబ్బందులు ఎదురు కాలేదన్నారు. స్వల్ప లక్షణాలతోనే పిల్లలకు కరోనా తగ్గిపోతుందని చెబుతున్నారు. కానీ కొంతమందిలో ఇబ్బందులు తలెత్తవచ్చని అంటున్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరికృష్ణతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..
ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్కు అవసరం లేదు: డాక్టర్ హరికృష్ణ - telangana latest news
పిల్లలకూ కరోనా సోకుతుందని పిల్లల వైద్యనిపుణులు డా.హరికృష్ణ చెప్పారు. స్వల్ప లక్షణాలు ఉన్న పిల్లలకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చన్నారు. కరోనా సోకిన తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వొచ్చని తెలిపారు. పాలు పట్టే సమయంలో మాస్కు ధరించాలని, చేతులు కడుక్కోవాలని సూచించారు.
ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్కు అవసరం లేదు: డాక్టర్ హరికృష్ణ