విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి ఆదేశాల మేరకు జడ్పీ కార్యాలయంలోని పరిసరాలను శుభ్రం చేసి పూల కుండీలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు.
'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి' - seasonal diseases in Rain season
నిజామాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పడి సంవత్సరకాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయంలోని పరిసర ప్రాంతాలను ఆయన శుభ్రం చేశారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా పరిషత్ పాలక వర్గం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.