బీసీ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించి వెంటనే ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీరికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మద్దతు ప్రకటించారు.
బీసీ ఉపాధ్యాయ సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ వీరికి మద్దతు ప్రకటించారు.
బీసీ ఉపాధ్యాయ సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా