ఈనెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ - batukamma sarees distribution will be starting from 23rd september
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అందించే చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
![ఈనెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4492416-thumbnail-3x2-batukamma.jpg)
ఈనెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
ఈనెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
నిజామాబాద్ జిల్లా మల్లారం గ్రామంలోని వ్యవసాయ గిడ్డంగుల్లో నిల్వ చేసిన బతుకమ్మ చీరల స్టాక్‌ను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. రేషన్ కార్డు కలిగిన ఆడపడుచులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగకు అందించే చీరలు ఈనెల 23 నుంచి పంపిణీ చేస్తామని తెలిపారు. స్టాక్‌ను రేషన్ షాప్ డీలర్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఈసారి ఆరు రకాల డిజైన్లు కలిగిన చీరలు పంపిణీ చేయనున్నామన్నారు.
- ఇదీ చూడండి : విష జ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: శ్రీధర్ బాబు