సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు - సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో సర్పంచ్ నోముల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు.
సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ నోముల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పంపిణీ చేసిన చీరలను కట్టుకొని దాండియా చేశారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
TAGGED:
bathukamma_celebrations