ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం దుర్మార్గమని నిజామాబాద్ జిల్లా బ్యాంక్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం దుర్మార్గం: ఉద్యోగులు - తెలంగాణ వార్తలు
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక పిలుపుతో దేశ వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. సమ్మెకు మద్దతుగా నిజామాబాద్ బ్యాంక్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం దుర్మార్గం: బ్యాంక్ ఉద్యోగులు
కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమ్మెను ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని బ్యాంకు అధికారులు కోరారు.