Bank agent cheats retail customers in varni: వారంతా చిల్లర వ్యాపారులు, రోజువారి కూలీలు రెక్కాడితే గానీ డొక్కాడిని పరిస్థితి వారిది. భవిష్యత్త్ అవసరాల కోసం బ్యాంకులో వీడీ ఖాతా తీసుకున్నారు. వారి నుంచి డబ్బులు వసూలు చేసిన బ్యాంకు ఏజెంట్ వారి ఖాతాలో వేయకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. వర్నిలోని కెనరా బ్యాంక్లో ఖాతాదారుల వీడీ అకౌంట్లోని డబ్బులు సుమారు రూ.15 లక్షల వరకు స్వాహా చేశాడు.
వంద మందికి పైగా చిరు వ్యాపారులు, కూలీలు ప్రతి రోజు 50 నుంచి రూ.500 వరకు బ్యాంక్ వీడీ ఖాతాలో జమ చేసుకుంటున్నారు. బ్యాంక్ అధికారూలు నియమించుకున్న శ్రీనివాస్ అనే బ్యాంకు ఏజెంట్ వ్యాపారుల వద్ద నుంచి రోజు వారిగా పొదుపు డబ్బులు వసూలు చేసి వారి ఖతాలో జమచేయాలి కానీ డబ్బులను ఖాతాలో జమ చేయలేదు. అయితే రోజు జమ చేసిన డబ్బులను శ్రీనివాస్ పక్కదారి పట్టించాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల కొందరు వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు వెళ్లి అరా చేశారు. తమ అకౌంట్లో డబ్బులు జమ కావడం లేదని తెలియడంతో ఆందోళన చెంది 15 రోజుల నుంచి ఖాతాదారులు డబ్బుల కోసం బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పొంతన లేని సమాధానం చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి సంపాదించినా డబ్బులు తమకు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.
కెనరా బ్యాంకులో వీడీ ఖాతా తీశాము. బ్యాంకు అధికారులు శ్రీనివాస్ అనే వ్యక్తిని ఏజెంట్గా నియమించారు. అతడు ప్రతి రోజు మా వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. మేము అతడిపై నమ్మకంతో ప్రతిరోజు డబ్బులను ఇచ్చేవాళ్లం. మా డబ్బులను తీసుకోవడానికి బ్యాంకు వెళ్లినప్పుడు ఖాతాలో జమకాలేదని అధికారులు చెప్పారు. మా డబ్బులు మాకు ఇప్పించగలరు.- బాధితులు
ఇవీ చదవండి: