తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP meeting: 'ప్రధాని కావాలని పగటి కలలు కంటూ కేసీఆర్‌ విఫల యాత్రలు చేస్తున్నారు' - Tarunchug at the BJP core committee meeting

BJP core committee meeting: ఎన్నికల్లో ఓటమితో సీఎం కేసీఆర్‌ నవంబర్‌లో రిటైర్డ్‌మెంట్‌ కావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ అన్నారు. విపక్షాల కూటమి కోసం అయన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

BANDI SANJY
BANDI SANJY

By

Published : Apr 19, 2023, 7:56 PM IST

BJP core committee meeting: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన తరుణ్‌ చుగ్‌.. ఎన్నికల్లో ఓటమితో సీఎం కేసీఆర్‌ నవంబర్‌లో రిటైర్డ్‌మెంట్‌ కావడం ఖాయమని అన్నారు. విపక్షాల కూటమి కోసం అయన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, చేవెళ్ల బహిరంగ సభ, చేరికలు, పార్టీ సంస్థాగత బలోపేతం అంశాలపై కోర్ కమిటీ సమావేశంలో నేతలు చర్చించారు.

దేశంలో ప్రధాని మంత్రి కావాలనే లక్ష్యంతో దేశంలో డజన్‌ మంది నేతలు దేశ వ్యాప్తంగా యాత్రలు చేస్తున్నారని తరుణ్‌చుగ్‌ విమర్శించారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌ ప్రధాని కావాలనే పగటి కలలు కుంటూ విఫలయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కూటమి కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా యాత్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌.. కేసీఆర్‌ మార్గం వేస్తోందని తరుణ్‌చుగ్‌ విమర్శించారు.

"కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌గా వ్యవహరిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరి కోసం పనిచేస్తున్నారు. దిల్లీలో కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌తో చేతులు కలిపారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్‌కు వ్యతిరేకంగా యాత్రలు చేస్తున్నారు. తెలంగాణ, దిల్లీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ.. కేసీఆర్‌ కోసం మార్గం సుగమం చేస్తోంది."- తరుణ్‌ చుగ్‌, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్

మిషన్‌ భగీరథతో మభ్యపెడుతున్నారు: మిషన్ భగీరథ కోసం 40వేల కోట్లు ఖర్చు పెట్టినా రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్లు రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఈ నెల 23న పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు అమిత్ షా చేవెళ్లకు రాబోతున్నారని తెలిపారు. ప్రధాని రోజ్ గార్ పేరుతో కేంద్రం ఉద్యోగాలు ఇస్తుందని.. ఇందులో ఎలాంటి అవినీతి జరగడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పరీక్షల్లో స్కామేనని సంజయ్‌ ఆరోపించారు.

"మిషన్‌ భగీరథ పేరుతో ప్రజలను కేసీఆర్‌ మభ్యపెట్టారు. మిషన్‌ భగీరథకు రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చినట్లు అవాస్తవాలు ప్రచారం చేశారు. అబద్ధాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కేసీఆర్‌.. ప్రశ్నపత్రం లీక్‌తో నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ప్రశ్నపత్రం లీక్‌పై సీఎం స్పందించకపోవడానికి కారణమేంటి? 30 లక్షల మంది భవిష్యత్తు కంటే రాజకీయాలు ముఖ్యమా? యువతకు భరోసా కల్పించడం కోసం సభ పెడతాం."- బండి సంజయ్‌ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

'ప్రధాని కావాలని పగటి కలలు కుంటూ కేసీఆర్‌ విఫల యాత్రలు చేస్తున్నారు'

ఇవీ చదవండి:

'సింగరేణి కార్మికుల కష్టాన్ని.. BRS నేతలు భక్షిస్తున్నారు'

ఆగని పోస్ట్​కార్డు యుద్ధం.. 2 లక్షల ఉత్తరాలతో ప్రధానికి మనవి

'దళిత బంధు తరహాలో.. బీసీ బంధు ప్రారంభించాలి'

ABOUT THE AUTHOR

...view details