తెలంగాణ

telangana

ETV Bharat / state

'బడిబయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పిద్దాం' - BADI BATA

నిజామాబాద్​ జిల్లా బోర్గాంలోని ప్రాథమిక పాఠశాలలో జయశంకర్​ బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్​ ఆర్​ఎన్ రామ్మోహన్​రావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించే విధంగా అధికారులు, గ్రామస్థులు సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.

'బడిబయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పిద్దాం'

By

Published : Jun 14, 2019, 2:02 PM IST

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించే విధంగా అధికారులు, గ్రామస్థులు సమష్టిగా కృషిచేయాలని నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ ఆర్​ఎన్ రామ్మోహన్​రావు పిలుపునిచ్చారు. బోర్గాంలోని ప్రాథమిక పాఠశాలలో జయశంకర్​ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రతి ఒక్క అధికారి శక్తివంచన లేకుండా కృషిచేయాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో ఉన్నతమైన విద్య, నాణ్యమైన భోజనం, ఉచిత పుస్తకాలు, ఉచిత ఏకరూప దుస్తులు అందిస్తుందని వివరించారు. కావునా తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ బడుల్లోకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్​ పాల్గొన్నారు.

'బడిబయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పిద్దాం'

For All Latest Updates

TAGGED:

BADI BATA

ABOUT THE AUTHOR

...view details