తెలంగాణ

telangana

ETV Bharat / state

చెత్తకుప్పలో శిశువు లభ్యం-శిశు గృహకు తరలింపు - Baby girl found in garbage at armur

తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన అప్పుడే శిశువు.. చెత్త కుప్పలో కనిపించింది. ఆడపిల్లని వద్దనుకున్నారో.. అసలు బిడ్డనే వద్దనుకున్నారో కానీ తెల్లారేసరికే వదిలించుకున్నారు. ఈ ఘోరమైన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో చోటు చేసుకుంది.

Baby found in garbage-move to baby home
చెత్తకుప్పలో శిశువు లభ్యం-శిశు గృహకు తరలింపు

By

Published : Nov 24, 2020, 1:19 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కమల నెహ్రూ కాలనీలో అప్పుడే పుట్టిన శిశువు చెత్తకుప్పలో ప్రత్యక్షమయింది. ఉదయం ఆరు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు సమాచారం.

చెత్తకుప్పలో శిశువును గమనించిన స్థానికులు శిశువును రక్షించి ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అధికారులకు సమాచారం అందించారు. పాపను స్వాధీనం చేసుకున్న అధికారులు నిజామాబాద్ శిశు గృహకు తరలించారు.

ఇవీ చదవండి: నిజామాబాద్ శివారులో అగ్నిప్రమాదం... పదిలక్షల సామాగ్రి దగ్ధం

ABOUT THE AUTHOR

...view details