తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2020, 9:48 AM IST

Updated : Oct 18, 2020, 10:52 AM IST

ETV Bharat / state

వైద్యుడు లేక వైద్యం చేసిన నర్సు.. గాల్లో కలిసిన శిశువు ప్రాణాలు

వైద్యులు అందుబాటులో లేక.. నర్సు పురుడు పోయడం వల్ల వైద్యం వికటించి శిశువు మృతి చెందిన ఘటన నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం సాలురలో చోటు చేసుకుంది. తల్లి పరిస్థితి విషమంగా  ఉంది. ఆమెను జిల్లా అస్పత్రికి తరలించారు.

Baby Die in Bhodhan Government Hospital
వైద్యుడు లేక వైద్యం చేసిన నర్సు.. గాల్లో కలిసిన శిశువు ప్రాణాలు

నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం సాలుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ డాక్టర్​ లేకపోవడం వల్ల ఓ మహిళకు నర్సు పురుడు పోయగా.. వైద్యం వికటించి శిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

డ్యూటీ డాక్టర్​ లేకపోవడం వల్ల ఏఎన్​ఎం నర్సు మాధవి అనే మహిళకు సాధారణ డెలివరీ చేసింది. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నవజాత శిశువు ఉమ్మనీరు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. కొద్దిసేపటికి ప్రాణాలు విడిచింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

Last Updated : Oct 18, 2020, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details