నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. తల్లి పొత్తిల్లలో ఉండాల్సిన శిశువు 38వ వార్డు సమీపంలోని చెత్త కుప్పలో ప్రత్యక్షమయ్యాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. శిశువులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
చెత్త కుప్పలో దొరికిన మగ శిశువు.. - baby found in dust bin in bodhan town
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మానవత్వం మరుగున పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన మగశిశువు చెత్త కుండీలో ప్రత్యక్షమయ్యాడు.
![చెత్త కుప్పలో దొరికిన మగ శిశువు.. baby found in dust bin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6048230-137-6048230-1581506288516.jpg)
చెత్త కుప్పలో దొరికిన మగ శిశువు..