రైతు రాజులా బతకాలన్నదే.. సీఎం కేసీఆర్ విధానమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో వానాకాల పంటల సాగు ప్రణాళికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న అన్ని పంటలకు.. గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తున్నామని జీవన్ రెడ్డి వెల్లడించారు.
వానాకాలం పంటల సాగు ప్రణాళికపై అవగాహన సదస్సు - ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవసాయంపై సమీక్ష
ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో వానాకాల పంటల సాగు ప్రణాళికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న అన్ని పంటలకు.. గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తున్నామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడించారు.
వానాకాల పంటల సాగు ప్రణాళికపై అవగాహన సదస్సు
డిమాండ్ కు తగ్గట్లు ఉత్పత్తి ఉండాలని.. రైతులు ప్రభుత్వ సూచనలు పాటించి సమగ్ర వ్యవసాయ విధానం అమలుకు కృషి చేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. రైతుబంధు, రైతుబీమా ప్రతి రైతుకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. దొడ్డురకం వరిని తగ్గించి.. సన్న రకం వరి పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుకూలంగా.. రైతులు ఏకక్రీవ తీర్మానం చేశారు.
ఇదీ చూడండి:నియంత్రిత విధానం.. లాభాలు ఘనం