నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం దుబ్బ తండాకు చెందిన వ్యవసాయ కూలీలు వేరే ఊరికి కూలీకి వెళ్లడానికి కిరాయికి ఆటో మాట్లాడుకున్నారు. బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామానికి కూలీ పనుల నిమిత్తం వెళ్తుండగా.. ఎడవల్లి మండల కేంద్రం సమీపంలో ఒక్కసారిగా ఆటో అదుపు తప్పి తలకిందులయింది. ఆటోలో ఉన్న 12 మందికి గాయాల పాలయ్యారు. ఐదుగుకు మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. వారికి స్థానిక ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఆటో బోల్తా.. 12మంది కూలీలకు గాయాలు - నిజామాబాద్ జిల్లా వార్తలు
వ్యవసాయ కూలీలను ఎక్కించుకొని ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది కూలీలు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
![ఆటో బోల్తా.. 12మంది కూలీలకు గాయాలు Auto Accident in niamabad district 12 womens injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8265235-246-8265235-1596353270045.jpg)
ఆటో బోల్తా.. 12మంది కూలీలకు గాయాలు