నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని శ్రీ దివ్య సంజీవని హనుమన్ ఆశ్రమంలో సురేశ్ ఆత్మరాం మహరాజ్ తలపెట్టిన అయోధ్య పాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది.
బోధన్ నుంచి అయోధ్య వరకు పాదయాత్ర.. - nizamabad dist news
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుంచి అయోధ్య వరకు సురేశ్ ఆత్మరాం మహరాజ్ పాదయాత్ర ప్రారంభించారు. లోకకల్యాణం కోసం శ్రీ దివ్య సంజీవని హనుమన్ ఆశ్రమం నుంచి ఈ యాత్రను మొదలుపెట్టారు.
బోధన్ నుంచి అయోధ్య వరకు పాదయాత్ర.. ఎందుకంటే!
లోకకల్యాణం, అందరూ బాగుండాలని ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సురేశ్ ఆత్మరాం మహరాజ్ తెలిపారు. ఆయన వెంట ఆలయ అర్చకులు రాకేశ్ శర్మ, ఆశ్రమ సభ్యులు సుధాంషు, శ్రేయంషు, నర్సింగ్, తదితరులు యాత్రలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న 'యుద్ధతంత్రం'