నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జకోరాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కమ్యూనిటీహాల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని పోచారం తెలిపారు. కాళేశ్వరం ఓ మహోన్నతమైన ప్రాజెక్టని కితాబిచ్చారు. ఈ ప్రాజెక్ట్ వల్ల కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన సభాపతి - ASSEMBLY SPEAKER STARTED DEVELOPMENT WORKS IN NIZAMABAD
నిజామాబాద్‌లోని వర్ని మండలంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాలను గ్రామస్థులకు వివరించారు.

ASSEMBLY SPEAKER STARTED DEVELOPMENT WORKS IN NIZAMABAD