నిజామాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 1.75 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గత జూలై నెలలో పలు బంగారం దుకాణాల్లో చోరీకి పాల్పడినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. దొంగతనం జరిగిన వెంటనే ఇద్దరిని అరెస్టు చేయగా... మరో ముగ్గురిని గత వారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ - నిజామాబాద్లో ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
నిజామాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.75 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్