మద్దతు ధర కావాలన్నారు. ఎన్నికల బరిలో నిలిచి జాతీయ స్థాయికి నిరసనను తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు పసుపు, ఎర్రజొన్న రైతులు. 178 మంది అన్నదాతలు నామపత్రాలను దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 185 మంది నిజామాబాద్ లోక్‌సభ బరిలో ఉండటం వల్ల దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
12 బ్యాలెట్ యూనిట్లు
నిజామాబాద్ ఎన్నిక కోసం మొదటిసారిగా అధునాతన ఎం-3 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. ఒక పోలింగ్ బూత్‌లో 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. లోక్‌సభ పరిధిలో 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2600 వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. యూ ఆకారంలో ఈవీఎంలను అమర్చనున్నారు. మూడు టేబుళ్లలో 12 ఈవీఎంలు.. ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. మొదటి ఈవీఎంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల పేర్లు, గుర్తులు, వారి ఫొటోలు... మిగతా యంత్రాల్లో స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. బరిలో ఉన్న 185 మంది అభ్యర్థులతో పాటు నోటా కలిపి మొత్తం 186 చిహ్నాలు ఉంటాయి.
ఈసీ ప్రత్యక్ష పర్యవేక్షణ
పోలింగ్ కోసం జిల్లా ఎన్నికల అధికారులు, సిబ్బంది తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. భారీగా అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎం-3 రకం యంత్రాలు బెంగళూరు నుంచి కంటెయినర్లలో నిజామాబాద్ తీసుకొచ్చారు. రెండు రోజులుగా ఈవీఎంల మొదటి దశ పరిశీలన నిర్వహిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి 700 మంది టెక్నికల్ ఇంజినీర్లు నిజామాబాద్‌కు వచ్చారు.
ఏజెంట్ల సమక్షంలో నమూనా ఎన్నిక