నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వలస కూలీలకు, నిరుపేదలకు 14 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి, ఆయా వార్డుల్లోని పేదలకు సరుకులు అందించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం 'జీవన్ అన్న ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత నాలుగు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. 44వ జాతీయ రహదారి వెంట వెళ్లే ఇతర రాష్ట్రాల వలస కూలీలకు భోజన సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేశారు.
ఆర్మూర్లో సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో వలస కూలీలకు, నిరుపేదలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు నిత్యావసర సరుకులు అందించారు.
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
లాక్డౌన్ కారణంగా గత నెల రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. విలువైన సేవలు అందిస్తున్నందుకు పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య, పోలీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.