గీతం యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ కోసం... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రవేశ పరీక్ష రాశారు. కరోనా నేపధ్యంలో యూనివర్సిటీ నిర్వాహకులు.. విద్యార్థులు ఇంట్లో ఉండి పరీక్ష రాసేలా ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యే తన ఇంటోనుంచే ఆన్‌లైన్‌లో ఎగ్జాం రాశారు. గత సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎంలో పట్టభద్రులు అయ్యారు. ఈ సంవత్సరం గీతం యూనివర్సిటీలో పార్ట్ టైం పీహెచ్‌డీలో చేరాలని ఎగ్జాం రాశారు.
ఆన్‌లైన్‌లో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి - geetham university phd entrance exam
గీతం యూనివర్సిటీ నిర్వహిస్తున్నఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాశారు. కరోనా నేపథ్యంలో యూనివర్సిటీలో నిర్వహకులు ఈ ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి