నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బాలకృష్ణ హాజరయ్యారు. గత సంవత్సరం తమ కళాశాల విద్యార్థులు సాధించిన విజయాలను ప్రిన్సిపాల్ రవి పటేల్ గుర్తుచేశారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు హోరెత్తించారు.
డిగ్రీ కళాశాల వార్షికోత్సవం విద్యార్థుల ఆటాపాటలు - నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో డిగ్రీ కళాశాల వార్షికోత్సవాలు అట్టహాసంగా సాగాయి. విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

వార్షికోత్సవం విద్యార్థుల ఆటపాటలు