తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిజామాబాద్‌ జిల్లాలో బర్డ్‌ ఫ్లూ సమస్య లేదు' - bird flu tension in nizamabad district

నిజామాబాద్​ జిల్లాలో బర్డ్​ఫ్లూ లేదని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ స్పష్టం చేశారు. వర్ని మండలం జలాల్​పూర్​లో కోళ్లు మృతి చెందడానికి రాణికేట్, ఫౌల్​ఫాక్స్​ కారణమని వెల్లడించారు.

Animal Husbandry Department  Joint Director bharat
నిజామాబాద్‌ జిల్లాలో బర్డ్‌ ఫ్లూ

By

Published : Jan 11, 2021, 5:35 PM IST

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్​పూర్​లో కోళ్లు మృతిచెందడానికి కారణం బర్డ్​ఫ్లూ కాదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ తెలిపారు. రాణికేట్, ఫౌల్​ఫాక్స్​తోనే కోళ్లు మరణించాయని స్పష్టం చేశారు. కోళ్ల రక్తనమూనాలు సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్​కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెప్పారు.

నిజామాబాద్ జిల్లాలో బర్డ్​ఫ్లూ రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫ్లూను ఎదుర్కొనేందుకు 22 ప్రత్యేక ర్యాపిడ్​ బృందాలు ఏర్పాటు చేశామంటున్న పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్​ భరత్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..

'నిజామాబాద్‌ జిల్లాలో బర్డ్‌ ఫ్లూ సమస్య లేదు

ABOUT THE AUTHOR

...view details