నిజామాబాద్ జిల్లా నవీపేట్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జానకంపేట్ - బాసర ప్రధాన రహదారి పక్కన చెట్ల పొదల్లో శవం కనిపించిందని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆనవాళ్లను పరిశీలిస్తే మరణించి రెండు మూడు రోజులైనట్లు తెలుస్తోందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం - Nizamabad Navipet Unknown Dead body
రోడ్డు పక్కన చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి... కేసుపై విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
Unknown Dead body