నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సోన్‌పేట శివారులోని శ్రీరాంసాగర్ జలాశయంలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభించింది. మృతుడు 4 రోజుల కింద మరణించి ఉంటాడని మెండోరా ఎస్‌ఐ సురేష్ తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి ఉందని, మృతుడు 55 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని వివరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతుడి శరీరంపై బ్లూకలర్ డ్రాయర్, లైట్ బ్లూకలర్ షర్టు ఉన్నాయని... తెలిసిన వారెవరైనా ఉంటే సమాచారం అందించాలని కోరారు.
శ్రీరాంసాగర్ జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - శ్రీరాంసాగర్లో గుర్తు తెలియని మృతదేహం
నిజామాబాద్ జిల్లా సోన్‌పేట శివారులోని శ్రీరాంసాగర్ జలాశయంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతదేహం కుళ్లిపోయి ఉందని, మృతుడు 55 ఏళ్లు ఉంటాడని పోలీసులు తెలిపారు.

శ్రీరాంసాగర్ జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం