Amit Shah Public Meeting in Armoor :తెలంగాణలో ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారని.. బీజేపీ ప్రభుత్వం రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం పసుపు బోర్డు(Turmeric board) ఏర్పాటు చేస్తోందని.. బోర్డు ద్వారా పసుపు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. పసుపు ఎగుమతులతో పాటు పరిశోధనలు జరుగుతాయని వివరించారు.
PM Narendra Modi Telangana Tour : ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెలలో తెలంగాణకు ప్రధాని మోదీ
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా ఆర్మూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. నిజామాబాద్ బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి లక్షలాదిగా గల్ఫ్(Gulf Country), విదేశాలకు వలస వెళ్తున్నారన్న షా.. వలస వెళ్లే కార్మికుల కోసం ఎన్‌ఆర్‌ఐ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని చెప్పారు.
Amit Shah Fires on KCR :కేసీఆర్ సర్కార్‌పై షా విరుచుకు పడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదని.. కానీ కేటీఆర్ కోసం మాత్రం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఓవైసీ కి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) నిర్వహించడం లేదన్నారు. దళిత సీఎం చేస్తామని కేసీఆర్ చెయ్యలేదని.. బీజేపీ వస్తే బీసీని సీఎం చేస్తామన్నారు. రూ.3100 కి క్వింటా చొప్పున ధాన్యం కొంటామన్నారు. ఫసల్ బీమా యోజన ప్రీమియంను బీజేపీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేపర్ లీకేజీ నిందితులను కచ్చితంగా జైలుకు పంపుతామన్నారు.