నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను భాజపా నేతలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యాలయంతో పాటు నగరంలోని ఫులాంగ్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిత్యావసరాల పంపిణీ - అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా భాజపా నాయకులు నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిత్వావసర సరకుల పంపిణీ
రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం కూరగాయలు అందజేసి లాక్డౌన్ను అందరూ పాటించాలని తెలిపారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజే 61 పాజిటివ్ కేసులు