తెలంగాణ

telangana

ETV Bharat / state

'అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం' - akila paksha protests in nizamabad district

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను అఖిలపక్షం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని మత రాజ్యాంగంగా మార్చే ప్రయత్నం చేస్తోందని తెదేపా నేత సీహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. దిల్లీలో జరిగిన అల్లర్లను నిరసిస్తూ ప్రజలకు సానుభూతి తెలిపారు.

'అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం'
'అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం'

By

Published : Sep 14, 2020, 10:05 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను అఖిలపక్షం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.

హిందూ.. ముస్లిం తగదాలు సృష్టించేేందుకే...

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిపై కేసు నమోదు చేయడం సరైంది కాదని ఖండించారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధానమంత్రి లౌకికవాదం, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదన్నారు. దేశంలో మత తగాదాలు సృష్టించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

భాజపా కక్ష సాధింపు చర్యలు..

దేశంలో నిరంతరం ప్రజల కోసం పనిచేసే వామపక్షాలపై భాజపా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేత శంకర్ గౌడ్, గంగాధర్, సీపీఐ నేత షేక్ బాబు సంజయ్, గౌతమ్, నాగరాజు, గంగాధర్, నజీర్, పోశెట్టి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఆమె లేకుండా బతకలేను.. మా పిల్లల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

ABOUT THE AUTHOR

...view details