పేద, దళిత, గిరిజనులు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. పార్ట్-బీలో చేర్చిన వాటికి డిజిటల్ పాసు బుక్కులివ్వాలని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
'పార్ట్-బీలో చేర్చిన భూములకు డిజిటల్ పాసు బుక్కులివ్వాలి' - Nizamabad District Latest News
పేద, దళిత, గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. పార్ట్-బీలో చేర్చిన వాటికి డిజిటల్ పాసు బుక్కులివ్వాలని కోరింది. జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేసింది.
!['పార్ట్-బీలో చేర్చిన భూములకు డిజిటల్ పాసు బుక్కులివ్వాలి' భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11033013-397-11033013-1615899078769.jpg)
భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్
అన్ని రకాల భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అటవీ అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. అటవీ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవారం, జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అవసరం: నారాయణ