తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 10:30 PM IST

ETV Bharat / state

'14న దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద రైతుల సంఘాల ధర్నా!'

రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లులను ప్రజలందరూ వ్యతిరేకించి... కార్పొరేట్​ వ్యవస్థల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్​ నిజామాబాద్​లో కోరారు. ఈ మేరకు 14న దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

aikmc leaders asking to oppose bill on farmers in parliament
'14న దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద రైతుల సంఘాల ధర్నా!'

కార్పొరేట్ వ్యవస్థల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్​ నిజామాబాద్​లోని ఎన్​ఆర్​ భవన్​లో కోరారు. ఓ వైపు కరోనా మహ్మమ్మారి.. మరోవైపు ప్రతి ఒక్కరూ ఆర్థిక సంక్షోభంలోకి అంతకంతకూ కూరుకుపోతున్న అసాధారణ స్థితిలో దేశం ఉందని ప్రభాకర్​ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో దేశానికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగంపై మోదీ ప్రభుత్వం సంస్కరణల పేరిట పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారని ఆరోపించారు.

పార్లమెంటులో రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టనున్న బిల్లులను ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యతిరేకించాలని అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నేతలు కోరారు. ఈ మేరకు ఈ నెల 14న దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్​ కార్యాలయాల వద్ద ఏఐకేఎంఎస్ రైతులు.. ఇతర రైతు సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి :'రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం'

ABOUT THE AUTHOR

...view details