గత ఎన్నికలన్నింటిలో కంటే 2019 ఎన్నికలు చాలా భిన్నమైనవన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్. సాధారణంగా ప్రచార సమయంలో అభివృద్ధి, పేదరిక నిర్మూలన, పథకాలు వంటి వాటి గురించి మాట్లాడేవారు. కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా... మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కేవలం కొన్ని కుటుంబాల అభివృద్ధి చూపిదేశాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం, సీబీఐ వంటి సంస్థలను భాజపా తన గుప్పిట్లో పెట్టుకొని నియంత్రిస్తుందని ఆరోపించారు.
ఈ ఎన్నికలు చాలా భిన్నమైనవి... ఎందుకంటే? - madhu yaski
మోదీ పాలనలో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని వాటిని చూసి... దేశాన్నే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ ఆరోపించారు. దేశాన్ని నామరూపాల్లేకుండా మారుస్తున్న ప్రధానికి ఈ ఎన్నికలు బుద్ధి చెబుతాయన్నారు.
సందీప్ దీక్షిత్