నిజామాబాద్ జిల్లా బాల్కొండ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఓ లారీ ట్రాక్టర్ను వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో మోసిన్ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పసుపును ఉడకబెట్టడానికని కూలీలు ట్రాక్టర్‌లో బాల్కొండ శివార్లలోని కల్లం వద్దకు వెళ్తున్నారు. నిర్మల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో ట్రాలీలో కూర్చున్న మోసిన్ అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.