తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​లో ఏసీబీకి చిక్కిన శానిటరీ ఇన్​స్పెక్టర్​

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో చనిపోయిన తండ్రి కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని అతని కొడుక్కి ఇవ్వడానికి శానిటరీ ఇన్​స్పెక్టర్​ లంచం డిమాండ్​ చేశాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు.

ఏసీబీ దాడి

By

Published : Mar 27, 2019, 7:07 PM IST

అవినీతి అధికారులను పట్టుకున్న ఏసీబీ అధికారులు
నిజామాబాద్​ జిల్లా బోధన్​ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాసరావు​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు సున్నం గంగాధర్​ అనే వ్యక్తి నుంచి 30 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

బోధన్​ మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయిన తన తండ్రి కాంట్రాక్టు ఉద్యోగాన్ని తనకు ఇవ్వాల్సిందిగా సున్నం గంగాధర్​ అనే వ్యక్తి శానిటరీ అధికారులకు ఆర్జీ పెట్టుకున్నాడు. కానీ శానిటరీ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, జవాన్​ సురేష్​ గౌడ్​... 50 వేలు లంచం డిమాండ్​ చేశారు. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తుగా 30వేల రూపాయల నగదు ఇస్తున్న సమయంలో అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details