తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదుకోవాలంటూ.. ఉరితాళ్లతో నిరసన - nizamabad district latest news

నిజామాబాద్ జిల్లాలో ఏబీవీపీ ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేసింది. ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను ఆదుకోవాలని ఎన్టీఆర్ చౌరస్తాలో డిమాండ్ చేసింది.

abvp protest, nizamabd
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, నిజామాబాద్

By

Published : Mar 26, 2021, 5:08 PM IST

విద్యాసంస్థల మూసివేతతో రాష్ట్రంలో ప్రైవేట్ అధ్యాపకులకు ఆత్మహత్యలే శరణ్యం అయ్యేలా ఉన్నాయని నిజామాబాద్ ఏబీవీపీ శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ జిల్లాలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉరి తాళ్లతో నిరసన వ్యక్తం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం పట్టభద్రుల ఎన్నికలలో ఓట్ల కోసం విద్య సంస్థలు తెరిచినట్టే తెరిచి మూసివేసిందని ఆరోపించింది. ఈ ఆందోళనలో ఏబీవీపీ కార్యకర్తలు ప్రైవేట్ ఉపాధ్యాయులను, నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఉపాధ్యాయులు, నిరుద్యోగులతో పెద్ద మొత్తంలో నామినేషన్లు వేసి ఒడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'ఆర్ఆర్ఆర్' నుంచి చరణ్ లుక్.. అదిరిపోయిందిగా!

ABOUT THE AUTHOR

...view details