తెలంగాణ

telangana

ETV Bharat / state

'కచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యమే' - 5th Class Student Dead With Electric Shock At Pulang Govt School In Nizamabad

అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పులాంగ్ ప్రభుత్వ పాఠశాలలో అయాన్​ఖాన్ విద్యుదాఘాతంతో మృతి చెందాడని ఏబీవీపీ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు.

'కచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యమే'

By

Published : Oct 26, 2019, 4:09 PM IST

నిజామాబాద్ జిల్లా పులాంగ్​లో కరెంట్ షాక్​తో మృతి చెందిన విద్యార్థి మృతి పట్ల ఏబీవీపీ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావుకు వినతి పత్రం అందించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్​కు నివేదిక సమర్పించినున్నట్లు జనార్దన్ తెలిపారు.

'కచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యమే'

ABOUT THE AUTHOR

...view details