కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన నిరుద్యోగి బోడ సునీల్ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ... నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: ఏబీవీపీ - నిజామాబాద్‌లో ఏబీవీపీ ఆందోళన
కాకతీయ విద్యార్థి సునీల్ మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి ఆదుకోవాలన్నారు. నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.

సునీల్ మృతిపై ఏబీవీపీ ఆందోళన
తెరాస వైఖరి వల్లే ఒక నిరుద్యోగి బలయ్యారని స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ నల్ల నవీన్ కుమార్ ఆరోపించారు. ఆరోజు రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేస్తే... ఈరోజు ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని నవీన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుక్తేష్, యోగేష్, ఈశ్వర్, కల్యాణ్, మల్లికార్జున్ పాల్గొన్నారు.