ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఆందోళన చేపట్టారు. నారాయణ పాఠశాలలను రద్దు చేయాలని పలుమార్లు డీఈవో దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో... డీఈవో స్పందించాలని బర్రెకు వినతిపత్రం అందజేశారు.
'కార్పొరేట్ శక్తులకు నిజామాబాద్ జిల్లాలో చోటు లేదు' - ABVP concern in Nizamabad district
నిజామాబాద్లో నారాయణ పాఠశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డీఈవో దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో... డీఈవో స్పందించాలని బర్రెకు వినతిపత్రం అందజేశారు.
'కార్పొరేట్ శక్తులకు నిజామాబాద్ జిల్లాలో చోటు లేదు'
డీఈవోకు ఎన్నిసార్లు చెప్పినా... ఫలితం లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఎన్నో వేల మంది అమాయక విద్యార్థుల ప్రాణాలు తీసిన కార్పోరేట్ మహమ్మారిని నిజామాబాద్ జిల్లా నుంచి తరిమేంత వరకు తమ పోరాటాన్ని సాగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం