తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడినే కడతేర్చింది - నిజామాబాద్​ నేర వార్తలు

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రి, మరో వ్యక్తితో కలిసి ఓ ఇల్లాలు భర్తను కిరాతకంగా అంతమొందించింది. మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం మందర్నాలో జరిగింది.

a wife killed her husband with parents
ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడినే కడతేర్చింది

By

Published : May 11, 2020, 10:36 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం మందర్నాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో తండ్రి, మరో వ్యక్తితో కలిసి భర్తను హతమార్చింది ఓ ఇల్లాలు. చేసిన పాపం బయటపడి కటకటాల పాలయ్యింది.

కోటగిరి మండలం కల్లూరుకు చెందిన సాయిరాం.. మందర్నాకు చెందిన గంగసారికకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. వివాహానంతరం సాయిరాం తన అత్తగారింటికి ఇళ్లరికం వచ్చాడు. పెళ్లికి ముందు నుంచే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న గంగసారిక... వివాహానంతరం తీరు మారలేదు. ఈ క్రమంలో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు తండ్రితో కలిసి పన్నాగం పన్ని శుక్రవారం రాత్రి కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామ శివారులోని మంజీరా నది సమీపంలో పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది.

ఘటనా స్థలికి చేరుకున్న బోధన్​ ఏసీపీ జయపాల్​ రెడ్డి, సీఐ షాకిర్​ అలీ మృతదేహాన్ని వెలికి తీసి తహసీల్దారు సమక్షంలో పంచనామ నిర్వహించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడినే కడతేర్చింది

ఇవీ చూడండి:గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక

ABOUT THE AUTHOR

...view details