ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 27న జన్నెపల్లి క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు కర్నె లింగం, రమేష్, నగేష్ అనుమానాస్పదంగా తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించారు. నగర శివారులోని సారంగపూర్ హనుమాన్ ఆలయంలో హుండీ దొంగలించిన విషయం బయటపడింది. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు లక్ష రూపాయల నగదు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలోనూ ఇళ్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతన్న ముఠా అరెస్ట్ - nizamabad cp kartikeya
నిజామాబాద్ జిల్లాలోని ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షరూపాయల నగదు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
![ఆలయాల్లో చోరీలకు పాల్పడుతన్న ముఠా అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3983178-376-3983178-1564420300084.jpg)
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతన్న ముఠా అరెస్ట్