తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి స్వల్ప వరద - srsp

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. గతకొన్ని రోజులుగా వరద తగ్గినప్పటికీ... మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ప్రవాహం వచ్చి చేరుతోంది.

శ్రీరాంసాగర్

By

Published : Sep 2, 2019, 4:11 PM IST

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. గత కొంతకాలంగా వరద రానప్పటికీ.. ప్రస్తుతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,092 అడుగులు.. కాగా ప్రస్తుత నీటిమట్టం 1,066 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ఇన్​ఫ్లో 23,470 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పుడైనా ఆశించిన మేర వరద వచ్చి డ్యాం పూర్తిస్థాయిలో నిండాలని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి స్వల్ప వరద

ABOUT THE AUTHOR

...view details