నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ వద్ద పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యోగాను అభ్యసించేవారు హాజరయ్యారు.
'ఇలా చేస్తే.. చర్మ సంబంధ వ్యాధులు దరిచేరవు' - nizamabad latest news
పతాంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. దీని వలన చర్మ సంబంధ వ్యాధులు దరిచేరవని నిర్వాహకులు తెలిపారు.
!['ఇలా చేస్తే.. చర్మ సంబంధ వ్యాధులు దరిచేరవు' mud bathing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11189808-927-11189808-1616912443117.jpg)
మట్టి స్నానం కార్యక్రమం
చెరువులు, నదుల నుంచి సేకరించిన మట్టిలో కలబంద, కుప్పంటి, వేపాకుతో పాటు.. కానుగాకు, తక్కిలాకు వంటి వివిధ ఆకుల మిశ్రమాన్ని వేసి కలిపి శరీరానికి పూసుకున్నారు. అలా పూసుకున్నాక 50 నిమిషాల తరువాత స్నానం చేస్తే ఎలాంటి చర్మ సంబంధ వ్యాధులు దరిచేరవని యోగా శిక్షకులు, కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి:వధశాలలు.. మద్యం దుకాణాలు బంద్..